Sunday, July 29, 2018

గారాల పట్టీ...😍



మా వారి గారాల పట్టీ..
జగత్ జెట్టీ..ఫ్రూటీ..
మా కంటి పాప స్వప్నం నువ్వు
మా ఇంట వెలిసిన అనురాగ దివ్వె నువ్వు
మా గుండె లయవి
మా హృదయాల్లో వికసించిన గులాబీవి
పున్నమి కాంతులీనే చందమామ
మా ఆనందాల చిరునామ
నువ్వు నవ్వితే ప్రభాతం
మాట్లాడితే నవ వసంతం
ఎదురొస్తే హేమంతం
నీ రాకతో మా జీవితాలు ధన్యం
నువ్వు లేకపొతే మా హృదయాలు శూన్యం
బంగారు తల్లి...పుట్టిన రోజు శుభాకాంక్షలు 💐💐💐💐🌹🌹

Saturday, July 14, 2018

వర్షించే మేఘం

వర్షించే మేఘమే నేనైతే...
చెరువులు నింపి అలుగై దూకనా..
పరవళ్లు తొక్కే సెలయేరై పారనా..
బీడు భూమిని తడిపే తొలకరినవనా..
రైతు నుదుట చెమట బిందువు నవనా..
పుడమి ని చుట్టే పచ్చని చీరనవనా..
పాతింటి చూరు నుండి జాలువారే జ్ఞాపకాన్నవనా..
పూసే ప్రతి పువ్వుని ముద్దాడే అమృత ధారనవనా..

Sunday, July 8, 2018

నీ చూపులే...

ఎదురొచ్చా నువ్వు చూస్తావని
నీ చూపులు నన్ను కాననే లేదు
పలకరిస్తే పరవశించి పోతా
కను సైగలే చాలంటావ్
కనుల కొలనులో నింపుకున్నా నీ రూపం
కానా నీకు నే సర్వస్వం ..