Thursday, September 20, 2018

అమ్మ

ఇలపై మన కోసం వెలిసిన దేవత అమ్మ ..
ఎలాంటి సమస్య నైనా ఎదుర్కునే శక్తి నిచ్చేది అమ్మ..
ఎలాంటి బాధ నైనా మరిపించగల స్నేహం అమ్మ..
ప్రపంచాన్నే జయించగల ధైర్యం అమ్మ..
నరకాన్ని కూడా స్వర్గం గా మార్చగల ప్రేమ అమ్మ..
వేసే ప్రతి అడుగులో మన తోడుండే నీడ అమ్మ..
ఆయువు పంచి మన కోసం అనుక్షణం పాటుపడే నిత్య శ్రామికురాలు అమ్మ...
మనమెలా ఉన్న మనల్ని  అందమైన యువరాణి లాగా ఊహించుకునే ఆ కళ్లు ఇంకెవరివి అమ్మవి తప్ప..
జీవితాంతం కళ్లలో పెట్టి చూసుకోడానికి కొడుకునైనా
కాకపోతిని కదా అమ్మా..

Sunday, July 29, 2018

గారాల పట్టీ...😍



మా వారి గారాల పట్టీ..
జగత్ జెట్టీ..ఫ్రూటీ..
మా కంటి పాప స్వప్నం నువ్వు
మా ఇంట వెలిసిన అనురాగ దివ్వె నువ్వు
మా గుండె లయవి
మా హృదయాల్లో వికసించిన గులాబీవి
పున్నమి కాంతులీనే చందమామ
మా ఆనందాల చిరునామ
నువ్వు నవ్వితే ప్రభాతం
మాట్లాడితే నవ వసంతం
ఎదురొస్తే హేమంతం
నీ రాకతో మా జీవితాలు ధన్యం
నువ్వు లేకపొతే మా హృదయాలు శూన్యం
బంగారు తల్లి...పుట్టిన రోజు శుభాకాంక్షలు 💐💐💐💐🌹🌹

Saturday, July 14, 2018

వర్షించే మేఘం

వర్షించే మేఘమే నేనైతే...
చెరువులు నింపి అలుగై దూకనా..
పరవళ్లు తొక్కే సెలయేరై పారనా..
బీడు భూమిని తడిపే తొలకరినవనా..
రైతు నుదుట చెమట బిందువు నవనా..
పుడమి ని చుట్టే పచ్చని చీరనవనా..
పాతింటి చూరు నుండి జాలువారే జ్ఞాపకాన్నవనా..
పూసే ప్రతి పువ్వుని ముద్దాడే అమృత ధారనవనా..

Sunday, July 8, 2018

నీ చూపులే...

ఎదురొచ్చా నువ్వు చూస్తావని
నీ చూపులు నన్ను కాననే లేదు
పలకరిస్తే పరవశించి పోతా
కను సైగలే చాలంటావ్
కనుల కొలనులో నింపుకున్నా నీ రూపం
కానా నీకు నే సర్వస్వం ..